మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ సినిమాతో కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా వున్నారు..స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు…ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, మైత్రీ మైవీ మేకర్స్, ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!!
ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్-2’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు..వార్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు… ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.అయితే ముందుగా ఈ సినిమాకు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది…కానీ అనూహ్యంగా బన్నీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.దీంతో ఎన్టీఆర్‌తో చేయాలని డిసైడ్ అయినట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. దీనిని హారికా హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కెమెరాకు చిక్కారు. అయితే ఆ సమయంలో ఆయన చేతిలో ఆనంద బాలసుబ్రమణ్యం రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విస్డమ్’ అనే బుక్ కనిపించింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ బిగ్ హింట్ ఇచ్చాడు..త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని అంతా భావిస్తున్నారు… అంతేకాకుండా ఈ బుక్ ఆధారంగానే ఈ మూవీ ఉండబోతుందని న్యూస్ వైరల్ అవుతుంది..
