MOVIE NEWS

వార్ 2 : ప్రమోషన్ షురూ.. ఊహించని సర్ప్రైజ్ లోడింగ్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న వార్‌ 2 లో ఎన్టీఆర్‌ విలన్‌ పాత్రను పోషిస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది..అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పూర్తిగా విలన్‌ పాత్ర కాకపోవచ్చని..నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అయ్యి ఉంటుందని, క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే వార్ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది.ఈ సినిమా ఆగస్టు 14 న విడుదల కాబోతున్న సంగతి తెల్సిందే. రిలీజ్ సరిగ్గా 50 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ వర్క్స్ ఇంకా మొదలు పెట్టలేదు. సౌత్‌ లో అయితే స్టార్ హీరోల సినిమాలు విడుదలకు రెండు నెలల నుంచే ప్రమోషన్‌ సందడి షురూ అవుతుంది…

‘కుబేర’ కలెక్షన్స్ సునామి.. ఐదు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..?

అయితే గతంలో ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి ఉహించిన రెస్పాన్స్ రాలేదు..దీనితో చిత్ర యూనిట్ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు సమాచారం.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాట ఉంటుందని సమాచారం.. ఆ ఒక్క పాటలో హృతిక్‌ తో కలిసి ఎన్టీఆర్‌ డాన్స్ చేస్తాడు. ఆ పాట అన్ని భాషల  ప్రేక్షకులను సినిమా వైపు తిప్పుకునేలా చేస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు.. అందుకే ఈ సినిమా నుంచి ఆ పాట కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్‌ కూడా ఆ పాట గురించి బాగా హైప్‌ ఇస్తున్నారు.

పాట విడుదల తర్వాత ట్రైలర్‌ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా వార్ 2 మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ స్పై థ్రిల్లర్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఊహించని క్రేజ్ తెచ్చుకుంటాడో లేదో చూడాలి..

Related posts

కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..

murali

కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!!

murali

నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!!

murali

Leave a Comment