తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కుబేర”..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..ఈ సినిమా లో అక్కినేని నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు..కుబేర సినిమా జూన్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఏకంగా ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరినట్లుచిత్ర యూనిట్ వెల్లడించింది.కాని ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కన్నప్ప : సెన్సార్ పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?
కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ, పుష్కూర్ రామ్మోహనరావు మరియు అజయ్ కైకాల సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది.. ఈ సినిమాలో దీపక్ అనే కీలక పాత్ర నాగార్జున కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సుమారు 181 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ధనుష్ సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా అంతంత మాత్రంగా సాగుతుంది.
ఈ సినిమాలో మెయిన్ అసెర్ట్ ధనుష్ నటన అనే చెప్పుకోవాలి.. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జీవించాడు.. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్, డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోసాయి.. ఇక దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది.. మొత్తానికి కుబేర సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.
