టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.. ఇదిలా ఉంటే వెంకీ తన తరువాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా ఎంతగానో ఎదురు చూసారు.. అనుకున్నట్లుగానే ఓ క్రేజీ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా సెట్ చేసాడు.. ఆ క్రేజీ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ క్లాసిక్ కాంబోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి స్క్రీన్‌పై మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
Akhil : ‘లెనిన్’ నుంచి క్విట్ అయిన శ్రీలీల.. తప్పుకుందా.. తప్పించారా..?
వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమాలు ‘నువ్వునాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమా సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసారు.. ఇక ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారని చేస్తుండటం.. అది కూడా మొదటి సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మామ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాగా ,అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. వెంకీ-త్రివిక్రమ్ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం..
