పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బిజీ కావడంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు.. గతంలో తాను కమిట్ అయిన సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరి హర వీరమల్లు”.. గత అయిదేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తవడంతో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ కాబోతుంది.
మీరాయ్ : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్..విజువల్స్ అదిరిపోయిందిగా..!!
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ట్రైలర్ జూన్ 2న రిలీజ్ కానుందని తెలుస్తుంది. అలాగే ట్రైలర్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై కూడా ప్లే చేయనున్నారట. ఇదే కనక జరిగితే ఇప్పటివరకు బుర్జ్ ఖలీఫా పై బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ జరిగాయి కానీ టాలీవుడ్ లో మాత్రం మొదటి సినిమా ఇదే అవుతుంది అని అంటున్నారు.
పవన్ చేస్తున్న మొదటి పీరియాడికల్ సినిమా కావడం..పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం.. అలాగే ఈ సినిమాలో పవన్ ఫైట్ కంపోజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.నిధి అగర్వాల్ హాట్ గ్లామర్ కూడా తోడవటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..క్రిష్, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు.