MOVIE NEWS

‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

అయితే గతంలో, అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసారు.కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఆ వార్త అభిమానులకు నిరాశ కలిగించింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ‘ ఐకాన్’ టైటిల్‌పై మరోసారి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు.. అతని సినిమాలు హై-ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు గ్రాండ్ విజువల్స్‌కు పెట్టింది పేరు.

తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.ఈ చిత్రం 2026 ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ లేదా ట్రిపుల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.. అందులో ఒక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవచ్చని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటి రానుంది..ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకున్నారు… అల్లుఅర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర కెక్కుతుంది..

Related posts

ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!!

murali

హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..?

murali

తారక్ బర్త్డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్..!!

murali

Leave a Comment