మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించు కున్న ఎన్టీఆర్ కెరీర్ లో తారా స్థాయికి దూసుకెళ్లారు.. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు..గత ఏడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస షూటింగ్స్ లో బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..
AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..?
ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో “ వార్ 2” మూవీ ఒకటీ…ఎన్టీఆర్ మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.. అది కూడా బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..నేడు మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేసారు..
తాజాగా విడుదల అయిన టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.. ఈ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా అందించారు.. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..