MOVIE NEWS

వీరమల్లు ట్రైలర్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ హరిహర వీరమల్లు”.. పవర్ స్టార్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..అయితే ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.. దీనితో క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.. మిగిలిన భాగం షూటింగ్ నిర్మాత ఏఎంరత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా కీలక బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు..ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.ఇక ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మేకర్స్ మొదటి భాగాని జూన్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ చిత్ర బృందం సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే ట్రైలర్‌ను కూడా వినూత్నంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై తెలుగు సినిమా ట్రైలర్ విడుదల కావడం ఇదే తొలిసారి. అయితే ఈ న్యూస్ గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Related posts

అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!!

murali

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

murali

పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?

murali

Leave a Comment