MOVIE NEWS

బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని తెలిపాడు.. అందుకు తగ్గట్టే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు..సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్‌, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.కానీ ఈ సినిమా నుండి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహనికి గురయ్యారు.. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. దాంతో షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయింది.

మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!!

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ తెరకెక్కిస్తున్నారు..తాజాగా మొదలైన ఈ షెడ్యూలులో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొనబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు మేకర్స్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ టీజర్ రెడీ చేస్తున్నారు. ఈ టీజర్ కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ ని ఫ్యాన్స్ చూపించేందుకు మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..

Related posts

పుష్ప 2 : రప్పా రప్పా ఫైట్ బ్యాక్ సీన్స్ చూసారా..?

murali

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

murali

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!!

murali

Leave a Comment