రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న ఈ రౌడీ స్టార్.. ఆ తరువాత గీతా గోవిందం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు..కానీ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఏది కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.. విజయ్ కెరీర్ పై లైగర్ ఎఫెక్ట్ బాగా పడింది.. ఆ సినిమా తరువాత చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచాయి.. దీనితో చిన్న గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ సినిమా మే 30న రిలీజ్ కానుంది.
మెగాస్టార్ కల్ట్ క్లాసిక్.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..?
ఆ తర్వాత మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో VD14 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.గతంలో విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా VD14 వర్కింగ్ టైటిల్ తో భారీ సినిమా తెరకెక్కుతుంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని, 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని గతంలో మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో VD14 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ లో విజయ్ ఫేస్ మాత్రం చూపించలేదు. ఓ దేవుడి విగ్రహం ముందు విజయ్ ధ్యానం చేస్తున్నట్టు ఉంది.ఈ పోస్టర్ లో విజయ్ అదిరిపోయే బాడీతో కనిపించాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.