MOVIE NEWS

AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

తారక్ బర్త్డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్..!!

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో జరగనుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..

ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. హీరోతో పాటు విలన్ గా కూడా బన్నీ నటించబోతున్నాడని తెలుస్తుంది… ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను దర్శకుడు అట్లీ డిజైన్ చేశాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు కూడా వినిపిస్తోంది.ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది..

Related posts

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..?

murali

మళ్ళీ అలాంటి స్లాంగ్ లోనే వస్తున్న రాంచరణ్ మూవీ..?

murali

ఎన్టీఆర్ పోస్ట్ కు బ్రహ్మీ ఫన్నీ రిప్లై.. ఈ ఫీలింగ్ ఏంట్రా చారి..!!

murali

Leave a Comment