MOVIE NEWS

SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం కాబోయే మూడో షెడ్యూల్ ను సైతం రాజమౌళి మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నాడు… మహేష్ సైతం రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.

కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మహేష్ ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా తనదైన స్టైల్ కామెడీతో కూడా అలరించనున్నాడటా.. అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఎక్కువ కామెడీని పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసిలో కూడా తీయనున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related posts

స్పిరిట్…. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే

filmybowl

విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

filmybowl

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

murali

Leave a Comment