MOVIE NEWS

కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్’… గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి విడుదలైన ‘హృదయం లోపల’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పూర్తీ సాంగ్ కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది.

స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

తాజాగా ‘హృదయం లోపల’ పూర్తి సాంగ్ విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన ట్యూన్ తో ‘హృదయం లోపల’ సాంగ్ ని అందంగా మలిచారు.సింగర్ అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను పాడారు.. ఈ సాంగ్ కి కేకే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

అయితే ‘హృదయం లోపల’ సాంగ్ విడుదల సందర్భంగా అనిరుధ్ మ్యూజిక్ గురించి విజయ్ దేవరకొండ తన భావాలను పంచుకున్నారు. దానికి లవ్ లెటర్ అనే పేరు కూడా పెట్టారు. “3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయా, నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి సాంగ్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు.

Related posts

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

murali

హరిహర వీరమల్లు : నో డౌట్ చెప్పిన డేట్ కి వస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

murali

Leave a Comment