పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించునున్నాడు..
Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!
మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది… ఇప్పటి వరకూ మాస్,లవర్ బాయ్ గా కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ ఉండనుందని సందీప్ తెలిపారు..
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తున్నట్లు సమాచారం..తాజాగా ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని డేట్స్ కూడా ఇచ్చినట్లు పింక్ విల్లా తెలిపింది..ఈ సినిమా స్క్రిప్ట్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ గా దీపికానే సందీప్ ఉంహించుకున్నారని కానీ దీపికా ప్రెగ్నెన్సీ తో ఉండటంతో వేరే ఆప్షన్ కోసం ట్రై చేసారని తెలిపింది.. తాజాగా దీపికా ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది..