MOVIE NEWS

Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా రామ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హీరో రామ్ ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్ ని స్వయంగా రాసాడనే సంగతి తెలిసిందే. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

రొమాంటిక్ ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోను రామ్ నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లోను తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు పాటల రచయితగా మారిన రామ్ రచించిన సాంగ్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు

Related posts

ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..?

murali

జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!!

murali

చరణ్ కు మెగాస్టార్, ఎన్టీఆర్ స్పెషల్ బర్త్డే విషెస్..!!

murali

Leave a Comment