హిట్ ప్రాంచైజ్ కి ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ వుంది… ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో `హిట్ 3`పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి..హిట్ సిరీస్‌లకు సమర్పకుడిగా వ్యవహరించి ఆ సినిమాల విజయాల్లో భాగస్వామిగా నిలిచిన నేచురల్ స్టార్ నాని తాజాగా `హిట్ ద థర్డ్ కేస్`లో నటించిన తెలిసిందే. హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తాజా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా గురువారం భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది..టీజర్, ట్రైలర్‌లతో విపరీతంగా అంచనాల్ని పెంచేసిన హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది..
‘వార్ 2’ తెలుగు రైట్స్.. క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!
కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కోలీవుడ్ హీరో కార్తీ అతిథి పాత్రలో నటించాడని, హిట్ 2 ఎండింగ్‌లో నాని అర్జున్ సర్కార్‌ల ఎంట్రీ ఇచ్చిన విధంగా కార్తి ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఈ రూమర్ పై మేకర్స్ అప్పట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కార్తి మాత్రం హిట్ 3లో నటించాడని న్యూస్ వైరల్ అయిందిగ. తాజాగా ఆ వార్తలని నిజం చేస్తూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `హిట్ 3` క్లైమాక్స్ ఎండింగ్‌లో కార్తీ కనిపించి తనదైన పంథాలో డైలాగ్ చెప్పిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో `రత్నవేల్ కార్తి పాండియన్` అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తి కనిపించబోతున్నాడు.
`దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్` అంటూ శ్రీగురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని కార్తి తన స్టైల్లో చెబుతూ ఎంట్రీ ఇచ్చిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది..హిట్ 3 లో నాని తన వైల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. `హిట్ 4` అంతకు మించి ఉంటుంది అని సమాచారం.. కార్తీ ని శైలేష్ మరింత వైలెంట్ గా చూపించ నున్నట్లు సమాచారం..
Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! 👮♂️🔥 That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! 💥 #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/OjvnEWLu2d
— Vicky Vicky (@VickyVi36330431) May 1, 2025