MOVIE NEWS

జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు..తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి ప్రపంచ దేశాలకు పరిచయం చేసారు.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా రూట్ క్లియర్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు..ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్ సైతం సాధించారు… ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు.. “ఎస్ఎస్ఎంబి “ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.. ఇదిలా ఉంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.. ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు రాజమౌళి ప్రకటించారు..

నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!!

అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఉంది.అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా చూపించాలని తన కోరిక అని కూడా తెలిపాడు.ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపిస్తానని రాజమౌళి చెప్పారు. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని గతంలో రాజమౌళి అన్నారు.

తాజాగా రాజమౌళి మహాభారతం సిరీస్ లోకి నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గత ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని రాజమౌళి తెలిపారు. మరి నానిని రాజమౌళి ఏ రోల్ లో చూపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది..

Related posts

కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?

murali

ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ ‘ఐ స్క్రీనింగ్ ‘పరీక్షలకు హ్యూజ్ రెస్పాన్స్..!!

murali

వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment