MOVIE NEWS

నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం నాగ చైతన్య తన తదుపరి చిత్రం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు… మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని అందిస్తుందని సమాచారం.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ సినిమాను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ.30 కోట్లు ఈ సినిమాకు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది..విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే నాగచైతన్య మరో మూవీ కూడా చేస్తున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తున్న ‘మయసభ’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.’నేను డైరెక్ట్ చేస్తున్న ‘మయసభ’ చిత్ర షూటింగ్ పూర్తయింది.. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. సాయి కుమార్, నాజర్, దివ్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇందులో చైతన్య రావు కూడా నటిస్తున్నాడు. ఆయన పేరును నాగ చైతన్య తో కంపేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.

Related posts

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

murali

AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!!

murali

చరణ్ క్లాసిక్ మూవీకి 7 ఏళ్లు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!

murali

Leave a Comment