Akhanda2 - Mass combination is back
MOVIE NEWS

అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబో లో సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే.. బాలయ్య సినిమా కోసం బోయపాటి ఇచ్చే మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతాయి…వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్కా. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..తాజాగా ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ తో మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గత ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా జరుగుతుంది.

పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..?

ఈ మూవీలో క్యూట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని సమాచారం…రీసెంట్ గా ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని, ఆమె పాత్ర గురించి వివరించగా.. దీంతో ఈ చిత్రం లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళుతోంది. మే నెల అంతా జార్జియాలోనే షూటింగ్ చేయనున్నట్లు సమాచారం… అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భం గా జూన్ 10న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది..ఈ అఖండ 2 ని పాన్ ఇండియా వైడ్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమా లో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని దర్శకుడు బోయపాటి తెలిపారు.

 

Related posts

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

murali

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..?

murali

Leave a Comment