MOVIE NEWS

డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!!

ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని సమాచారం..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాకు ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తుంది..హోంబాలే బ్యానర్ నుంచి బయటకు వచ్చి ప్రశాంత్ నీల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో రెమ్యూనరేషన్ గట్టిగానే డిమాండ్ చేసారని సమాచారం.. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా సరిగ్గా ఇదే సమయంలో ఒక టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన టీ-సిరీస్ కూడా ఈ ప్రాజెక్టులో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో టీ-సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు గానూ, నాన్-థియేట్రికల్ రైట్స్ దక్కించుకోబోతున్నట్లు సమాచారం..

Related posts

సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..?

murali

వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!!

murali

ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment