ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది.. అట్లీ సినిమా కోసం తరచుగా బన్నీ ముంబై వెళ్తూ వున్నాడు..తాజాగా బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్ లో ఆదివారం బన్నీకి లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం…
నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!!
మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన ఈ సెషన్ సాయంత్రం వరకు కొనసాగిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది..ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ ను అట్లీ ఎన్నో రకాలుగా ట్రై చేశాడని, రగ్గ్‌డ్ లుక్ నుంచి నార్మల్ లుక్ వరకు ప్రతీదీ ట్రై చేశారని తెలుస్తోంది. పుష్ప సినిమాతో బన్నీ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అట్లీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ట్రై చేయనున్నాడని సమాచారం.. అల్లు అర్జున్ ఈ లుక్ టెస్ట్ లో ఎంతో ఇష్టంగా పాల్గొన్నట్లు సమాచారం..
ఇప్పటివరకు అల్లుఅర్జున్-అట్లీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియలేదు..కానీ ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.. అందుకే అల్లుఅర్జున్ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం…తాజాగా ఈ కాన్సెప్ట్ షూట్ లో సినిమాలోని ఓ కీలక అంశం కోసం 12 ఏళ్ల పిల్లలను కూడా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.జూన్ నెలాఖరు నుంచే ఈ బిగ్గెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.