MOVIE NEWS

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర తరువాత ఎన్టీఆర్ తన లైనప్ లో భారీ సినిమాలు సిద్ధం చేసుకున్నాడు.. ఇప్పటికే ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన “ వార్ 2” లో తన పార్ట్ షూటింగ్ పూర్తి అయింది.. ఆగష్టు 14 న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా ఎన్టీఆర్ వరుస షూటింగ్స్ కారణంగా ఎన్టీఆర్ లేని షాట్స్ ప్రశాంత్ ఇప్పటివరకు తెరకెక్కించారు.. ప్రశాంత్ నీల్‌తో ఎన్‌టిఆర్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ సినీ ప్రేమికులలో అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది… ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ డేట్ పై కన్ఫ్యూషన్..!!

ఈ చిత్రం కర్ణాటకలో ఏప్రిల్ 22న అనగా రేపటి నుండి షూట్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచటానికి మేకర్స్ ఎన్టీఆర్ మరియు నీల్ కలిసి వున్న ఫోటోను పోస్ట్ చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు..

1950 ల లో మాదకద్రవ్యాల మాఫియాకు అపఖ్యాతి పాలైన మయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్ పాల్గొన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం.. ఈ సినిమాలో టోవినో థామస్ శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు..సలార్ ఫేమ్ రవి బస్రుర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.. కన్నడ బ్యూటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..

 

Related posts

అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?

filmybowl

మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

పెద్ది : ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్.. స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

Leave a Comment