టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు.ఏప్రిల్ 18 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించారు.. మూవీలో వారిద్దరి మధ్య నడిచే ఎమోషనల్ జర్నీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అయితే మూవీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రతీ ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు…
ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!!
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు.. సినిమాకు క్లైమాక్స్ మెయిన్ అసెట్ గా నిలిచింది.క్లైమాక్స్ అందరూ ఊహించినదే కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు.. దీంతో క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయని రీతిలో ఉండి ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లీకొడుకుల మధ్య బంధాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునేలాఈ సినిమా క్లైమాక్స్ మెప్పిస్తుందని అంతా చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ నటనకు ఓ రేంజ్ లో ప్రశంసలు దక్కుతున్నాయి..
ఈ సినిమా క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.కళ్యాణ్ రాం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాలి. ఏ హీరో ఆ క్లైమాక్స్ కు ఓకే చెప్పరని, కానీ కళ్యాణ్ రామ్.. మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా నటించారని సినీ ప్రియులు చెప్పుకొస్తున్నారు..బింబిసార తరువాత సాలిడ్ హిట్ కోసం చూస్తున్న కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అదిరిపోయే సక్సెస్ అందించింది..