పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరి హర వీరమల్లు “.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఈ ఏడాది మోక్షం కలగనుంది.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమా పై హైప్ పెంచేసింది.. అయితే ముందుగా ఈ సినిమానీ మార్చి 28 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో రిలీజ్ డేట్ ని మే 9 కి వాయిదా వేసారు.
విశ్వంభర : కీలకంగా మారిన విజువల్స్.. బజ్ అంతంత మాత్రమే..!!
కానీ ఆ డేట్ కి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.. అందుకే మే 30 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. అయితే అదే డేట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కింగ్డమ్” రిలీజ్ కానుంది.ఈ సినిమా ను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..
గత కొంత కాలంగా హిట్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.. ఇటీవల ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల అయిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.. అయితే విజయ్ దేవరకొండ సినిమా కథ మీద ఎంతో నమ్మకంగా వున్న నాగావంశీ అదే రోజు రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి..