మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన ‘భోళా శంకర్’ సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో మెగా అభిమానులతో సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ టీజర్ రిలీజయ్యాక ఈ సినిమా పరిస్థితి వేరే లా మారింది…టీజర్ లో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్‌గా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు.
‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..?
వీఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా కాస్త వాయిదా పడిపోయింది. వేసవిలో అయినా సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొన్ని నెలలుగా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు..తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘రామ రామ’ అనే ఫస్ట్ సింగిల్ ను హనుమాన్ జయంతి సందర్బంగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. సాంగ్ లో విజువల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అయినా కూడా ఫ్యాన్స్ లో అదే అనుమానం.. జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు.. కానీ విజువల్స్ చూసాక సినిమా హైప్ కాస్త తగ్గిపోయింది.. మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు..
ప్రస్తుతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ మీద మేకర్స్ ఫుల్ కాన్సంట్రేషన్ చేసారు..విజువల్స్ అద్భుతంగా వస్తేనే సినిమాపై హైప్ వస్తుందని లేట్ అయినా సరే మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..