MOVIE NEWS

ఓటిటీలకు కాలం చెల్లినట్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

గత కొంత కాలంగా ఓటిటి ల ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై బాగా ప్రభావం చూపుతుంది.కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఓటిటి ప్రభావం ఉదృతంగా పెరిగింది. కేవలం ఓటీటీ ని నమ్ముకుని సినిమా తీసిన నిర్మాతలు సైతం ఉన్నారు. ఓటీటి ప్రేక్షకులు చూసినా తమ సినిమా బడ్జెట్ వచ్చేస్తుంది అని సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పటికీ వున్నారు..అయితే ఎప్పుడూ కూడా బిజినెస్ మోడల్ ఒకేలా ఉండదు. మొదట సినిమాల్ని విరివిగా కొన్న ఓటీటీ సంస్థలు ఆ తర్వాత వరుసగా నియమ నిబంధనలు పెట్టడం మొదలు పెట్టాయి..ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్ డేట్ ని సైతం నిర్ణయించే స్థాయికి వాటి ప్రభావం పెరిగింది..ప్రస్తుత పరిస్థితులలో సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి, ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండాలి అనేది కొన్ని పెద్ద ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ నిర్ణయిస్తున్నాయి.మొదట్లో ఓటీటి మూలంగా నిర్మాతలకు లాభాలు వచ్చేవి..అయితే ఈ లాభార్జన క్రమంగా ఓటీటీలకి అనుకూలంగా మారింది.

ఇంట్రెస్టింగ్ గా సూర్య ‘రెట్రో ‘ ట్రైలర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..?

ఇప్పుడు ఓటీటీ నమ్ముకొని సినిమా చేస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపుకోవడమే అనే పరిస్థితి వచ్చేసింది.అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాని నిర్మించిన సునీల్, అశోక్ ఇదే అంశాన్ని సూటిగా చెప్పుకొచ్చారు.ఓటీటీ ని నమ్ముకొని సినిమా చేస్తే మునిగిపోయినట్లే ఆయన అన్నారు… మన కంటెంట్ మీద నమ్మకం వుండాలి. సినిమా అల్టిమేట్ బిజినెస్ థియేటరే కావాలి. ఓటీటీల శకం ముగిసింది.. దాన్ని నమ్ముకొని సినిమా చేయడం ఆపేయాలి. సినిమా అనేది కేవలం థియేటర్ ఆధారంగా నిర్మించాలి..

ఒకప్పుడు శాటిలైట్ ఎలా ఎలా వెలిగి ఆగిపోయిందో ఇప్పుడు ఓటీటీ పరిస్థితి అలాగే మారింది… ఆ సంస్థలు పెట్టే నియమాలకు లోబడి సినిమాలు రిలీజ్ చేయడం కంటే ఆ ఆప్షన్ ని తీసేయడమే మేలు’అని ఆయన అన్నారు..ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించే సినిమాలు తీస్తే ఆ ట్రెండ్ మళ్ళీ వస్తుంది అని ఆయన అన్నారు..

 

Related posts

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!!

murali

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

Leave a Comment