తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా.. ఎన్నో భారీ అంచనాలతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఆ భారీ సినిమా సూర్య కు తన ఫ్యాన్స్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా కంగువా నిలిచింది..దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ‘రెట్రో’సినిమా పైనే ఉన్నాయి.కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ‘రెట్రో’.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!!
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ బిగ్గెస్ట్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ సినిమా నిడివి మొత్తం 2 గంటలా 48నిమిషాలు ఉన్నట్లు సమాచారం.అయితేనిడివి విషయంలో తన గత చిత్రాల ఫార్మాట్‌నే దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దీనికీ సైతం కొనసాగించారు. ‘పేట’, ‘మహాన్’, ‘జిగర్తాండ’, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ చిత్రాలన్నీ 2 గంటలా 40 నిమిషాలనే రన్‌టైమ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘రెట్రో’కు మేకర్స్ అదే ఫాలో అయ్యారు.
అయితే ఈ సినిమాని యాక్షన్‌తో పాటు, ప్రేమ, గాఢమైన భావోద్వేగాలతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..అయితే ఈ సినిమా తరువాత సూర్య స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో “ రోలెక్స్” అనే బిగ్గెస్ట్ మూవీ చేయనున్నాడు..