MOVIE NEWS

తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ముఖ్యంగా సింహాద్రి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కి వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది.. వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్న టైం లో ఎన్టీఆర్ తో రాజమౌళి యమదొంగ సినిమా చేసాడు.. ఆ సినిమా మరో కొత్త ఎన్టీఆర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తాతకు తగ్గ మనవడి గా ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు.

వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ.. ఫ్యాన్స్ కి పండగే..!!

పేజీలకు పేజీలు డైలాగ్స్ సింగిల్ టేక్ లో చెప్పడం ఎన్టీఆర్ జ్ఞాపకశక్తికి నిదర్శనం..ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబో లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”.. ఈ సినిమాను రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ తో కలిపి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కించాడు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ సినిమాలో రాంచరణ్,ఎన్టీఆర్ పోటీ పడి మరీ నటించారు.. అయితే ఈ సినిమాలో వచ్చే కొమురం భీముడో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు..

తాజాగా ఆ పాట లో ఎన్టీఆర్ నటన గురించి దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు..కొమురం భీముడో సాంగ్ తీయడానికి నేను ఏ మాత్రం కష్టపడలేదు..ఎందుకంటే ఆ సాంగ్ లో తారక్ పూనకం వచ్చినట్లు నటించాడు..చివరికి నుదిటి మీద, దవడ మీద చిన్న కదలికల్ని కూడా ఎంతో కచ్చితత్వం తో చేసి చూపించాడు..నేను కేవలం, కెమెరా, సాంగ్ పెట్టి వదిలేసాను మిగతాది అంతా తారక్ చూసుకున్నాడని జక్కన్న చెప్పుకొచ్చారు ..

Related posts

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

filmybowl

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment