పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరి హర వీరమల్లు “.. ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకొని మే 9 విడుదల కాబోతుంది.. అయితే ఆ డేట్ కి కూడా హరిహర వీరమల్లు రిలీజ్ కష్టమే అని మళ్ళీ వాయిదా పడుతుందనే పుకార్లు వైరల్ అవుతున్నాయి…అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చే పరిస్థితి లేకపోయినా ఇప్పటిదాకా జరిగిన భాగానికి సంబంధించిన ఇతర పనులు ఆగకుండా దర్శకనిర్మాతలు చూసుకుంటున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను కచ్చితంగా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తాజాగా ఈ విషయాన్నీ దర్శకుడు జ్యోతి కృష్ణనే షేర్ చేసారు..
యమదొంగ : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..!!
ఈ విజువల్ గ్రాండియర్ లో మొత్తం ఆరు యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయట. వాటిలో ఇరవై నిముషాల పాటు వచ్చే ఒక కీలక యాక్షన్ సీన్ కంపోజ్ చేసే బాధ్యత స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు సమాచారం… హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో మొత్తం 1100 మందితో 61 రోజులకు పైగానే పవన్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారని తెలుస్తుంది.. దీని కోసం ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ సహాయం కూడా తీసుకున్నారు. సినిమా మొత్తానికి ఈ సీన్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ ధీమాగా వున్నారు…
గతంలో జానీ, డాడీ సినిమాల కోసం పవన్ స్వయంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు.. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా పవన్ ప్రతిభకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది..