టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తూ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ దిల్ రాజు భారీగా లాభాలు పొందుతున్నారు.అయితే ఇటీవల తెరకెక్కిన భారీ సినిమా “ గేమ్ ఛేంజర్ “ నిరాశ పరిచిన ఆయన నిర్మాణంలో వచ్చిన మరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టి దిల్ రాజుకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. సూపర్ సక్సెస్ తో ఫుల్ ఫామ్‌లో ఉన్న దిల్ రాజు ఎస్వీసి బ్యానర్ నుండి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు, నితిన్ ‘’తమ్ముడు’ వంటి చిత్రాలు రాబోతున్నాయి.
చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..?
ఇదిలా ఉంటే దిల్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా, దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేసి అందరికీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.త్వరలో ఆయన కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ సినీ ప్రియులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆయన ఏఐ ఆధారిత మీడియాను స్థాపించబోతున్నట్లు దిల్ రాజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
”అతను ఒక దృష్టితో ప్రారంభించాడు. ఆయన మనకు మరపురాని కథలు అందించారు. ఇప్పుడు, అతను సినిమాను మించిన దాన్ని నిర్మిస్తున్నారు. మా బ్లాక్‌బస్టర్ నిర్మాత దిల్‌రాజు తెలివైన వారితో కలిసి పని చేస్తున్నారు.క్వాంటమ్ ఏఐ గ్లోబల్ AI-ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించేందుకు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన AI సాధనాలను అభివృద్ధి చేయడానికి, అందించడానికి స్థలాన్ని చూస్తున్నారు. మే 4న పేరు మరిన్ని వివరాలను ప్రకటిస్తున్నాము” అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇప్పటి నుంచి ఏఐ ద్వారా సినిమాల్లో కేవలం కొన్ని సీన్స్ మాత్రమే తెరకెక్కించాము.. త్వరలో ఏఐ తో మరిన్ని అద్భుతాలు చేయనున్నట్లు గా వారు తెలిపారు..
He started with a vision.
He gave us unforgettable stories.
Now, he’s building something beyond cinema.Our blockbuster producer #DilRaju collaborates with the brilliant minds at @QuantumAIGlobal to launch an AI-powered media company 💥
A space… pic.twitter.com/R7R7tQSYWN
— Sri Venkateswara Creations (@SVC_official) April 16, 2025