అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడి పోయారు.. సిసింద్రీ ఎంట్రీ ఇచ్చాడు..తండ్రి లాగే మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు.. కానీ అఖిల్ కెరీర్ లో ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు.. హీరోగా నిలదొక్కుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ బడ్జెట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ కావడంతో డీలా పడ్డ అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని ఓ బిగ్గెస్ట్ మూవీని ఓకే చేసాడు.. ఆ బిగ్గెస్ట్ మూవీనే “లెనిన్”.. “వినరో భాగ్యము విష్ణుకథ” ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అఖిల్ పుట్టినరోజు సందర్బంగా “లెనిన్”ని గ్లింప్స్ రూపం లో ఫ్యాన్స్ కి పరిచయం చేసారు..
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!!
అల్ట్రా స్టైలిష్ లుక్స్ కి భిన్నంగా ఈసారి అఖిల్ ని పక్కా మాస్ పల్లెటూరి యువకుడిగా చూపిస్తున్నారు.. అఖిల్ లుక్ మాత్రం అదిరిపోయింది..పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది పేరు ఉండదు, పోయాక ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటది.. వంటి ఇంట్రెస్టింగ్ డైలాగుతో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో ఫ్యాన్స్ కి మేకర్స్ చెప్పేశారు.అఖిల్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. శ్రీలీల లుక్ సైతం ఎంతో ఆకట్టుకుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది లోనే లెనిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అయితే మేకర్స్ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు..
లెనిన్ మూవీ స్టోరీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్తూరు పరిసరాల్లో ఈ సినిమా సాగనుంది..అఖిల్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం..ఈ సారి అఖిల్ కి భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కూడా ధీమాగా వున్నారు..