నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే విజయశాంతి కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.తాజాగా నిర్వహించిన ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గతంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా ఒకెత్తు.. ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ కట్ చేసారు.
తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయశాంతి, ఆమె కుమారుడిగా అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారు.. ఇక వీరిద్దరి మధ్య ఒక మనస్పర్థ కారణంగా దూరం పెరుగుతుందని, విజయశాంతి చట్టం ప్రకారం శిక్షించాలని ప్రయత్నిస్తుంటే, అర్జున్ తనదైన చట్టం చేసుకుంటూ ఎవరినైతే పడితే వారిని శిక్షిస్తూ ముందుకు వెళుతున్నట్లు చూపిస్తారు…
అయితే ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది.. ఇది పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కింది.. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..