మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు.. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది..
AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!!
ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యం లో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి చిత్ర యూనిట్ పని చేస్తోంది… ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…ఈ సినిమా ను జులై 24 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..తాజాగా ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.. రీసెంట్ గా ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ రామ’ సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచన చేసారు. హనుమంతుని వైభవాన్నీ తెలియజెస్తూ సాగిన సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది.. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళు తర్వాత కీరవాణి మెగాస్టార్ కలయికలో వచ్చిన ఈ మొదటి సాంగ్ విజువల్ గా కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది.