పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెర కెక్కింది.. ఈ బిగ్గెస్ట్ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. వరుస వాయిదాల తరువాత ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!!
అయితే హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నట్లు కొన్ని రోజులుగా మళ్ళీ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది..ఈ రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.మే 9న హరిహర వీరమల్లు సినిమాను కచ్చితంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ‘రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.తుఫాను వేగంతో వర్క్ జరుగుతుంది.. ఈ వేసవికి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందిస్తాము అని మేకర్స్ తెలిపారు.. మే 9న హరిహర వీరమల్లు బిగ్ స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల అవుతుంది.
ఇదివరకు ఎన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.మేకర్స్ ఇచ్చిన అప్డేట్ తో ఈ సినిమాపై రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లయింది.ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాతో పాటు పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది..