మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ “విశ్వంభర”.. భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. అందుకోసక్ం మెగాస్టార్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..మూవీ ప్రారంభం లో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకోగా గత ఏడాది మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి..
ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!!
Vfx మరీ పూర్ గా ఉండటంతో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. దీనితో మేకర్స్ Vfx వర్క్ పై మరింత ఫోకస్ పెట్టి పని చేస్తుంది.. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ Vfx వర్క్ డిలే కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.హనుమాన్ జయంతి కానుకగా ఏప్రిల్ 12న రామ రామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు…
రామ రామ అంటూ ఫుల్ ఎనర్జీటిక్గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.మెగాస్టార్ సరసన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను జులై 24 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..