MOVIE NEWS

ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించునున్నాడు..

విశ్వంభర : మెగాస్టార్ కి ఆ ట్యూన్ నచ్చలేదా..?

మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది… ఇప్పటి వరకూ మాస్, లవర్ బాయ్ గా చిత్రాల్లో కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ ఉండనుందని సందీప్ తెలిపారు..అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా వున్నాడు..

రాజాసాబ్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది.. కానీ కొన్ని కారణాల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజ్ కావాలి.. షూటింగ్ బ్యాలన్స్ vfx కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది..అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది.. త్వరలోనే ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనున్నాడు..

 

Related posts

దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..?

murali

“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!!

murali

చరిత్రలో నిలిచిపోయే పాత్రలో అల్లుఅర్జున్ ..బన్నీపై త్రివిక్రమ్ భారీ ప్రయోగం ..?

murali

Leave a Comment