MOVIE NEWS

AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు అంటే నే ఆ సినిమా పై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మరింత భారీగా ప్లాన్ చేసాడు.. అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడనే విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. అయితే ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..?

అయితే అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత, త్రివిక్రమ్ లాంటి రీజియనల్ దర్శకుడితో సినిమా చేస్తే అంతగా మార్కెట్ ఉండదనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ అట్లి తో సినిమా చేయడానికి కమిట్ అయ్యినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందా అనీ అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లుఅర్జున్ కి జోడీగా సమంతని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.సమంత వరుస బాలీవుడ్ సిరీస్ లతో గ్లోబల్ బ్యూటీ గా మారింది..దీనితో ఈ పాన్ ఇండియా సినిమాకి సామ్‌ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఆమెను సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘పుష్ప’ తో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చింది. అలాగే దర్శకుడు అట్లీ ‘జవాన్’ తో బాలీవుడ్ లో రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ బిజినెస్‌కి బాగా హెల్ప్ అవుతుందని మేకర్స్ సమంతని సెలక్ట్ చేశారని తెలుస్తుంది… అయితే ఈ విషయం గురించి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది..

 

Related posts

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్

filmybowl

లోకేష్ కనగరాజ్ కూలీ ఫుటేజ్ లీక్ వివాదంపై స్పందన.

filmybowl

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

murali

Leave a Comment