MOVIE NEWS

మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే మూవీ సెట్ చేసుకున్న వశిష్ఠ..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డిలే అవుతూ వస్తుంది.. సమ్మర్ లో `విశ్వంభర` రావడం కష్టమే.. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగష్టు 22 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. ఈ సినిమాను యూ వీ క్రియేషన్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది.. మెగాస్టార్ సరసన ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రీ కరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది..

సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..?

అయితే యంగ్ డైరెక్టర్ వశిష్ట విశ్వంభర తరువాత ఏ హీరోతో సినిమా చేయనున్నాడో అనేది ఆసక్తికరంగా మారింది.చిరు మూవీ తరువాత అదే కాంపౌండ్ లో వశిష్ట తన నెక్స్ట్ సినిమాను లాక్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయాల్సిందిగా చిరంజీవి వశిష్ఠ ను అడిగినట్లు సమాచారం.చిరు అడిగే సరికి వశిష్ట కూడా కాదనకుండా ఓకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

వైష్ణవ్ తేజ్ గత కొంత కాలంగా వైఫల్యాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత వైష్ణవ్ కు సరైన బ్రేక్ రాలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆది కేశవ చిత్రాలు కమర్శియల్ అంతగా రాణించలేదు. దీంతో వైష్ణవ్ సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడు..అయితే వైష్ణవ్ కోసం ఇప్పటి కిప్పుడు తన వద్ద స్టోరీ లేదని..అందుకు సమయం కావాలని చిరంజీవిని వశిష్ఠ కోరడటా కూడా అందుకు మెగాస్టార్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

 

Related posts

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

filmybowl

కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!!

murali

వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే

filmybowl

Leave a Comment