ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫ్యాన్స్ నుండి ప్రముఖ సెలెబ్రేటీస్ నుంచి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.. పుష్ప 2 తో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.. పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ రావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..అయితే బన్నీ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ మరో సినిమా చేసేందుకు బన్నీ ఓకే చెప్పారు..గతంలోనే ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలిపారు.
AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!!
అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉండనున్నట్లు అనౌన్స్ చేసారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నేడు సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసారు. పాన్ వరల్డ్ లెవల్లో కమర్షియల్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు..
దీంతో త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు… తాజాగా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉన్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉంది కానీ అట్లీ సినిమా అయ్యాక ఆ సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో త్రివిక్రమ్ బిజీగా వున్నారు.. మైథలాజి బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
Wishing a very happy Birthday to our dearest ICON STAR @alluarjun garu ❤️🔥
May your journey be more iconic & impactful. Here’s to creating more chapters of cinema’s most electrifying saga ♥️♥️
Can't wait to begin our #Production8 🤩 soon! #HappyBirthdayAlluArjun 🌟 pic.twitter.com/7t5NyJcfCu
— Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2025