MOVIE NEWS

అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఆడియన్స్ కి కామెడీ మూవీస్ అంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు..కేవలం కామెడీ ప్రాధన్యతగా తీసిన సినిమాలలో ప్రేక్షకులు సరికొత్త ఫన్ కోరుకుంటారు.. కొత్త డైరెక్టర్స్ కామెడీ ట్రాక్స్ రాయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ ఆ కోవలోకి వచ్చిందే.. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలయి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. యూత్ కి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది..

‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మేకర్స్ సీక్వెల్ రూపొందించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ కామెడీ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు..మార్చి 28, 2025న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల బాట పట్టింది.. ఇదిలా ఉంటే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిన్న ఎంతో గ్రాండ్ గా జరిగింది.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చారు..మ్యాడ్ సినిమా తనకి ఎంతో ఇష్టమైన సినిమా అని మ్యాడ్ స్క్వేర్ కూడా అద్భుతంగా ఉందని ఆ మూవీ టీం అందరిని తారక్ కంగ్రాట్యులేట్ చేసారు..

ఈ సందర్బంగా తన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని తారక్ చెప్పారు.. ఆ సినిమాలో తాను చేసిన కామెడీకి మంచి పేరు వచ్చిందని తారక్ అన్నారు..అయితే చాలా మంది అదుర్స్ సినిమాకు సీక్వెల్ కోరుకున్నారు..కానీ అదుర్స్ 2 ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఆ సినిమాలో ఎంతో సహజంగా వర్కౌట్ అయినా కామెడీ మళ్ళీ తాను చేయగలనో లేదో అన్న భయం వుంది.. అందుకే దాని జోలికి పోలేదు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు..

Related posts

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..?

murali

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

filmybowl

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

murali

Leave a Comment