గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ 16 వ సినిమాగా తెరకెక్కుతుంది..సుకుమార్ శిష్యుడిగా వున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ సినిమాలకు వర్క్ చేసాడు.. సుకుమార్ ఆశీర్వాదంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన తో సంచలన విజయం అందుకున్నాడు.. ఆ సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్నా బుచ్చి బాబు నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు.. ఎన్టీఆర్ తో బుచ్చి బాబు తరువాత మూవీ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.. అది కార్యరూపం దాల్చలేదు..
పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!
ఆ సమయంలో చరణ్ కు పెద్ది స్టోరీ వినిపించగా ఆ నచ్చడం, సినిమా ఓకే అవడం చక చకా జరిగింది.. మొన్నటి వరకు “ గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీగా వున్న రాంచరణ్ ఆ సినిమా బెడిసి కొట్టడంతో బుచ్చి బాబు సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు..ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ గిఫ్ట్ గా ఇవ్వాలని చరణ్ చూస్తున్నాడు..వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ మూవీ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.. ఈ సినిమాలో చరణ్ “ఆట కూలీగా” కనిపించునున్నాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..మైత్రీ మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు..
ఇదిలా ఉంటే రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఈ శ్రీ రామ నవమికి మేకర్స్ ఈ చిత్రం నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా చరణ్ బుచ్చి బాబుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే.. జై శ్రీరామ్ అని రాసివున్న ఆంజనేయస్వామి పాదుకలను ఇచ్చాడు.. చరణ్ నుంచి గిఫ్ట్ అందుకున్న బుచ్చి బాబు ఈ బెస్ట్ మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..
రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!