MOVIE NEWS

నాగావంశీ : ఆ సినిమాకు పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో నా ఛాయిస్ ఆయనకే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతమున్న టాప్ మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంటుంది..వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ అధిక సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ అద్భుతం గా నడిపిస్తున్నారు.. ప్రస్తుతం సితార బ్యానర్ లో క్రేజీ మూవీస్ తెర కెక్కుతున్నాయి.

మార్చి 28 న ఈ బ్యానర్ నుంచి మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే డేట్ న రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ చాలా టఫ్ ఉన్నప్పటికీ మ్యాడ్ స్క్వేర్ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా జర్నలిస్టులతో కాకుండా సినిమాలో నటించిన హీరోతో వెరైటీ ఇంటర్వ్యూ చేశారు. అందులో నాగావంశీ కీలక విషయాలు తెలిపారు.సితార బ్యానర్ 50వ సినిమా తెరకెక్క బోతుంది..ఎలాంటి నిర్మాణ సంస్థ కైనా 50 వ సినిమా అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన నెంబర్. అందుకే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా ఈ క్రేజీ మూవీ తీయాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు..తాజాగా హీరో సంగీత్ శోభన్ 50 వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు..

తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!!

పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఒకరితో మాత్రమే మీ బ్యానర్ లో 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారని అడిగారు.దానికి నాగవంశీ సమాధానమిస్తూ పవన్ ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీగా వున్నారు.ఆయన రాజకీయంగా మరింత పెద్ద పొజిషన్ కి వెళ్లే అవకాశం వుంది..ఇలాంటి సమయంలో ఆయనతో సినిమా చేయడం సాధ్యపడదు.. అందుకే పవన్, తారక్ ఇద్దరిలో ఛాయస్ పెట్టుకుంటే తారక్ కే ప్రాధాన్యం ఇస్తాను అంటూ నాగ వంశీ తెలిపారు.

 

Related posts

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

హిట్ కాంబో మళ్ళీ రిపీట్.. ఆ యంగ్ డైరెక్టర్ తో ధనుష్ రెండో సినిమా..!!

murali

కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

murali

Leave a Comment