MOVIE NEWS

రాజాసాబ్ : ఆ పాటలన్నీ చెత్త బుట్టలో వేసా.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజాసాబ్ “..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది..వరుస యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ కి బోర్ కొట్టి ఫ్యాన్స్ కోసం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు.. దీనితో మారుతీ డైరెక్షన్ లో హారర్ కామెడీ జోనర్ స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పేసాడు.. ప్రభాస్ మళ్ళీ వింటేజ్ స్టైల్ మూవీ తో రావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే సినిమా షూటింగ్ పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ వుంది.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సి వుంది.. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!

తాజాగా రాజాసాబ్ మ్యూజిక్ విషయంలో ఇప్పటివరకు చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, మళ్లీ కొత్తగా చేస్తున్నానని తమన్ అన్నారు..ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.అయితే ‘రాజాసాబ్’ పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘రాజాసాబ్’కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు”ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ ఇలా చాలా సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ కూడా చేయబోతున్నారు.

రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ అంతా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాటని చేస్తున్నాం. నిజానికి ‘రాజాసాబ్’ కోసం చాలా పాటలు సిద్ధం చేశాను.. కానీ నాకెందుకో వాటిని మార్చేద్దాం అనిపించింది. ఆ సినిమా కోసం ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చాను. కానీ షూటింగ్ లేట్ అయింది.. దీంతో వాటిని డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నానని డైరెక్టర్ కి చెప్పాను..గతంలో చేసిన సాంగ్స్ ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని మోసం చేయలేను.. ఎప్పుడైనా హానెస్ట్ గా ఉండటమే కరెక్ట్ అని తమన్ అన్నారు..

 

Related posts

తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!!

murali

ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!!

murali

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

murali

Leave a Comment