పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం షూటింగ్ గురించి రోజుకో వార్త బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా సగం పూర్తి కావాల్సి ఉందని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం..ఈ పరిస్థితిలో ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోతే షూటింగ్ అయితే ముందుకు సాగడం కష్టమని తెలుస్తుంది. ‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జోరుగా జరుగుతుంది..
కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!!
ఈ సినిమా 2022 అక్టోబర్‌లో ప్రారంభమయింది.. అయితే, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాడట.. ఇప్పటివరకు టాకీ భాగంలో 80-85% పూర్తయినట్లు వార్తలు వచ్చినా కానీ , ఇంకా ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు అలాగే కొన్ని పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుండటంతో ‘రాజా సాబ్ కి ఆయన పూర్తి డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది.
దీనితో ప్రభాస్ బాడీ డబుల్‌ని ఉపయోగించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ, ప్రభాస్ స్వయంగా హాజరైతేనే సినిమా షూటింగ్ సాఫీగా సాగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నాడు… ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, యోగి బాబు వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.