MOVIE NEWS

ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ “డ్రాగన్“.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ సరికొత్తగా చూపించనున్న్నాడని సమాచారం..ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగిన చాలా కాలానికి ఈ సినిమా షూటింగ్ మొదలైంది..అది కూడా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఇంకా జాయిన్ కాలేదు.. ఈ నెలాఖరుకు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్ కోసం అంతకు మించి సినిమాను తెరకెక్కించబోతున్నాడు..

కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!!

ఈ సినిమాలో బ్లాక్‌ అండ్ వైట్‌ బాక్గ్రౌండ్ లో తారక్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేసి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఈ బిగ్గెస్ట్ కాంబోలో వస్తున్న సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు… ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. డ్రాగన్ మూవీ సెకండ్ షెడ్యూల్‌ రావణ రాజ్యం అయిన శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుందని ఓ టాక్ నడుస్తుంది.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే..

సెకండ్ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసాడని సమాచారం.. ఈ సినిమాకు సంబందించి త్వరలోనే మరో బిగ్గెస్ట్ అప్డేట్ రానుంది. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

Related posts

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

Leave a Comment