MOVIE NEWS

కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!!

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నాని నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తాజాగా నాని నిర్మించిన కంటెంట్ బేస్డ్ మూవీ “కోర్ట్”..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తాను నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్ 3” చూడొద్దంటూ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి… సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!!

కానీ నాని కాన్ఫిడెన్స్ మరోసారి గెలిచింది. తాజాగా రిలీజ్ అయిన కోర్ట్ సినిమా యునానిమస్ విన్నర్ గా నిలిచింది. సాధారణంగా కోర్ట్ రూమ్ మూవీస్ టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా ఎక్కడం లేదు… పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సైతం వంద కోట్లు దాటలేదు.దీనితో అలాంటి సినిమాలకు టాలీవుడ్ లో స్కోప్ ఉండదని అంతా భావించారు.కానీ కోర్ట్ మూవీ విషయంలో ఇప్పుడవన్నీ బద్దలైపోయాయి. కోర్ట్ బుకింగ్స్ మొదటి రోజుకు కంటే శని ఆదివారాలు ఎక్కువగా జరిగనున్నాయి… దీనితో ఇప్పుడు నాని చాలా నిశ్చింతగా ఉన్నాడు.

ఇవాళ జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హిట్ 3 బుకింగ్స్ మొదలుపెట్టమంటారా అంటూ తన మాట గెలిచిందనే ఆనందం మొహంలో కనిపించింది. మే 1 విడుదల కాబోతున్న హిట్ 3 ప్రమోషన్లు వచ్చే వారం నుంచి మొదలుపెట్టొచ్చని సమాచారం. నాని ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాడు. మొదటి రెండు భాగాల్లో నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ ల కంటే తన మార్కెట్ పెద్దది కావడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాపై ఊహించని బజ్ ఏర్పడింది..

 

Related posts

ది రాజాసాబ్ : మూవీ ఔట్పుట్ పై ప్రభాస్ అసంతృప్తి..!!

murali

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

murali

బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!!

murali

Leave a Comment