MOVIE NEWS

బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!!

సూపర్ స్టార్ మహేష్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు.. అయితే గతంలో ఆగడు, వన్ నేనొక్కడినే వంటి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబుకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ విజయం సాధించింది.. అలాగే భారీ కలెక్షన్స్ కూడా సాధించింది..అయితే మహేష్ శ్రీమంతుడు సినిమా దగ్గరి నుంచి ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేసారు..అందులో భాగంగానే ఆ మూవీలు ప్రేక్షకాధారణ పొందుతూ మంచి విజయం సాధిస్తున్నాయి ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను సినిమా ఒకటి.

రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!!

శ్రీమంతుడు తరువాత కొరటాల దర్శకత్వంలో మహేష్ నటించిన రెండో సినిమా ఇదే కావడం విశేషం..ఇందులో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

అయితే రిలీజ్ సమయంలో ఈ సినిమా రన్ టైం ఎక్కువ అవడంతో కొన్ని సీన్స్‌ను ఎడిటింగ్ లో తీసేసారు… కానీ సినిమా హిట్ అవడంతో డిలిటేడ్ సీన్స్‌ను యాడ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అందులో హోళీ ఫైట్ సీన్ కూడా ఉందట. కానీ ఇప్పటివరకు ఆ హోళీ ఫైట్‌ సీన్‌ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికీ ఆ ఫైట్‌ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు..తాజాగా నేడు హోళీ సందర్భంగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది… మరో హోళీ పండుగను కూడా భరత్ అనే నేను మూవీ హోళీ ఫైట్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

 

Related posts

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

murali

సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”

murali

OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..?

murali

Leave a Comment