దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదంటేనే అర్ధం చేసుకోవచ్చు.. దర్శకుడిగా ఆయన పనితనం ఏ రేంజ్ లో ఉంటుందో.. రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించారు…రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టులు పాన్ ఇండియా వైడ్ అద్భుతం సృష్టించాయి.. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి బాహుబలితో రికార్డు కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ బడా డైరెక్టర్స్ కి సైతం ఛాలెంజ్ విసిరారు.. ఇప్పటి వరకు బాలీవుడ్ లో బాహుబలిని తలదన్నే పీరియాడిక్ మూవీ రాలేదు.. ఈ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కించిన మరో బిగ్గెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్”.. టాలీవుడ్ లోని ఇద్దరు బడా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్ తో రాజమౌళి ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనం సృష్టించాడు.
SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఈ సారి ఇంటర్నేషనల్ క్రేజ్ సాధించాడు.. ఈ సినిమాతో ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన “ఆస్కార్” సాధించి చరిత్ర సృష్టించాడు..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్ కు ఆస్కార్ లభించింది.. ఈ అవార్డ్ లభించడంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది.. ఇదిలా ఉంటే ఈ అద్భుతమైన మూమెంట్ జరిగి రెండేళ్లు అవుతుంది అంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..
SSMB అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..
The day India 🇮🇳 won its first Oscar for a feature film in any category. pic.twitter.com/9E3qz1tKU5
— RRR Movie (@RRRMovie) March 12, 2025