MOVIE NEWS

“రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడిగా, హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ప్రదీప్ రంగనాథన్‌ అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్‌ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో వఎంతగానో అలరించిన ప్రదీప్ రంగనాథ్..తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఓరి దేవుడా ఫేమ్ అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌ రంగనాథ్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ అయింది..

ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!!

రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. యూత్ ను ఆకట్టుకునే స్టోరీతో వచ్చి ప్రదీప్ తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా విడుదలైన మొదటి 10 రోజులలో వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలిజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా మార్చి 21 నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటి స్ట్రీమింగ్ కు రానుంది..ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..ఈ యంగ్ హీరో నటించిన మరో లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపేని’ త్వరలోనే రిలీజ్ కు సిద్ధం అవుతుంది.

 

Related posts

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

murali

హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!!

murali

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

murali

Leave a Comment