Akhanda2 - Mass combination is back
MOVIE NEWS

రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!!

నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ వరుస సక్సెస్ లతో జోరుమీద వున్నాడు.. బాలయ్య ఇటీవల నటించిన “ డాకు మహారాజ్ “ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నారు..బాలయ్య వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారు..ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “అఖండ 2 : తాండవం”..గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన “అఖండ” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు తెరకెక్కుతున్న నాలుగో సినిమా అఖండ 2 కూడా భారీ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా వున్నారు..

వావ్ : నిధి పాప మరో భారీ ఆఫర్ పట్టేసిందిగా..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటించిన డాకు మహారాజ్ థియేటర్స్ లో కన్నా ఓటీటీ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. దానితో బాలయ్య బోయపాటి అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు కన్నేశాయి.

డాకు మహారాజ్ కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ కలిపి 60 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అఖండ 2 కి పాన్ ఇండియాలోని పలు భాషల్లో దాదాపుగా 80 కోట్ల రికార్డ్ ధరకి డిజిటల్ రైట్స్ సేల్ చేస్తున్నట్లు సమాచారం.. అఖండ 2 సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

 

Related posts

సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!!

murali

గేమ్ ఛేంజర్ స్టోరీ లీక్ చేసిన శంకర్.. చరణ్ నటనకు ఫిదా..!!

murali

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

Leave a Comment